రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2021-12-31T19:27:41+05:30 IST

రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన రాంపూర్‌లో గురువారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెల మృతి

ధర్మసాగర్‌, డిసెంబరు 30 : రోడ్డు ప్రమాదంలో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన రాంపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకా రం.. కాజీపేట మండలం రాంపూర్‌కు చెందిన తొట్టె జంపయ్యకు చెందిన గొర్రెల ను మేత కోసం తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బీరప్ప గుడి సమీపంలోకి రాగానే రోడ్డు దాటుతున్న క్రమంలో హనుమకొండ నుంచి వస్తున్న కారు గొర్రెలను ఢీకొట్టడంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.

Updated Date - 2021-12-31T19:27:41+05:30 IST