1,302 కోట్ల ‘రైతుబంధు’ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-31T08:09:12+05:30 IST

మూడెకరాల లోపు భూమి ఉన్న 10 లక్షల 51 వేల 384 మంది రైతులకు రైతుబంధు పథకం కింద గురువారం రూ.1,302.6 కోట్లు పంపిణీ చేశారు.

1,302 కోట్ల ‘రైతుబంధు’ పంపిణీ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూడెకరాల లోపు భూమి ఉన్న 10 లక్షల 51 వేల 384 మంది రైతులకు రైతుబంధు పథకం కింద గురువారం రూ.1,302.6 కోట్లు పంపిణీ చేశారు. మూడు రోజుల్లో మొత్తం 45,95,167 మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,102.04 కోట్ల నగదు బదిలీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు. ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 62,04,085 ఎకరాలకు రూ.5 వేల చొప్పున రైతుబంధు సహాయం అందించినట్లు తెలిపారు.

Updated Date - 2021-12-31T08:09:12+05:30 IST