108 అంబులెన్స్‌లో వైద్యం అందక పసికందు మృతి

ABN , First Publish Date - 2021-02-06T14:06:05+05:30 IST

రంగారెడ్డి: హైద్రాబాద్ శివారు శంషాబాద్‌లో విషాదం నెలకొంది. 108 అంబులెన్స్‌లో వైద్యం అందక పసికందు మృతి చెందింది.

108 అంబులెన్స్‌లో వైద్యం అందక పసికందు మృతి

రంగారెడ్డి: హైద్రాబాద్ శివారు శంషాబాద్‌లో విషాదం నెలకొంది. 108 అంబులెన్స్‌లో వైద్యం అందక పసికందు మృతి చెందింది. సరియైన ఆక్సిజన్ అందక పోవడంతో పసికందు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. నవమాసాలు మోసిన బిడ్డ తన కళ్లముందే మృతి చెందడంతో కన్నపేగు తల్లడిల్లింది. దీంతో పసికందు తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుంచి 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో సరియైన సదుపాయాలు, సిబ్బంది లేకపోవడంతోనే తన బిడ్డ మృతి చెందిందంటూ తల్లి ఆరోపిస్తోంది.


Updated Date - 2021-02-06T14:06:05+05:30 IST