10 లక్షల పరిహారం చెల్లించాల్సిందే

ABN , First Publish Date - 2021-02-26T08:10:51+05:30 IST

తమ బిడ్డ లోపంతో జన్మించడానికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమంటూ వి నియోగదారుల ఫోరంను ఆశ్రయించిన దంపతులకు ఊరట లభించింది. వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ 2016

10 లక్షల పరిహారం చెల్లించాల్సిందే

రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం

లోపంతో బిడ్డ జననంపై జిల్లా ఫోరం తీర్పునకు సమర్థన


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తమ బిడ్డ లోపంతో జన్మించడానికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమంటూ వి నియోగదారుల ఫోరంను ఆశ్రయించిన దంపతులకు ఊరట లభించింది. వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ 2016 ఏప్రిల్‌లో జిల్లా ఫోరం ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ రాష్ట్ర ఫోరం ఇటీవల తీర్పు వెలువరించింది. రాజేంద్రనగర్‌కు చెందిన మహిళ 2012లో గర్భం దాల్చడంతో... కూకట్‌పల్లిలో ని పద్మప్రియ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. కాన్పుకోసం ఆమెను చందానగర్‌లోని నీలిమా ఆస్పత్రికి పంపారు. అక్క డి వైద్యులు పిండంలో లోపం ఉన్నట్టు గుర్తించి కాన్పు చేసేందుకు నిరాకరించారు. దీంతో పద్మప్రియ ఆస్పత్రిలోనే పురుడుపోశారు. లోపంతో జన్మించిన ఆ బిడ్డ నిల్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ దంపతులు తమకు న్యాయం చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఫోరాన్ని ఆశ్రయించారు. ఆస్పత్రియాజమాన్యం వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. దీనిని పద్మప్రియ ఆస్పత్రి యాజమాన్యం రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో సవాల్‌ చేసింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎ్‌సకే జైస్వాల్‌, జస్టిస్‌ మీనారంగనాథన్‌ల బెంచ్‌ జిల్లా కోర్టు ఆదేశాలను సమర్ధిస్తూ.. ఆ అప్పీల్‌ను కొట్టేసింది. 

Updated Date - 2021-02-26T08:10:51+05:30 IST