ఐపీఎల్ 2021 డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు యప్ టీవీ సొంతం!
ABN , First Publish Date - 2021-04-06T23:57:30+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఐపీఎల్ డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను యప్ టీవీ సొంతం చేసుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యప్‌టీవీ సబ్‌స్క్రైబర్లు ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ మ్యాచ్‌లను వీక్షించగలుగుతారు. అలాగే, దాదాపు వంద దేశాల్లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం దక్కింది.
ఆస్ట్రేలియా, భూటాన్, యూరప్ ఖండం, దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, శ్రీలంక, ఆగ్నేయాసియా (సింగపూర్, మలేసియా మినహా), మాల్దీవులు, నేపాల్ సహా దాదాపు వంద దేశాల్లో వివో ఐపీఎల్ 2021ని బ్రాడ్‌కాస్ట్ చేయనున్నట్టు యప్ టీవీ ప్రకటించింది. ఐపీఎల్‌లో భాగంగా 60 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.
భారత్‌లో నెలకు రూ. 49తో యప్‌టీవీ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. జూమ్, టైమ్స్ నౌ, ఎన్‌డీటీవీ ఇండియా, ఆజ్‌తక్ సహా 160 చానళ్లను యాక్సెస్ చేసుకోవచ్చు. టీవీ షోలు, మూవీలు కూడా చూసుకోవచ్చు. 14 భాషలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇండియాలో మాత్రం యప్ టీవీ ద్వారా మ్యాచ్‌లను చూడడం వీలుకాదు. దేశంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అలాగే, ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ ద్వారానూ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.