యశస్వినికి స్వర్ణం
ABN , First Publish Date - 2021-03-21T09:37:53+05:30 IST
వరల్డ్ కప్‌లో తొలిరోజు ఆతిథ్య భారత షూటర్లు అదరగొట్టారు. స్టార్ షూటర్ మనూభాకర్ను వెనక్కి నెట్టిన యశస్విని సింగ్ దేశ్వాల్ వరల్డ్‌కప్ షూటింగ్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణ పతకం...

- మనూకు రజతం
- ప్రపంచ కప్ షూటింగ్
న్యూఢిల్లీ: వరల్డ్ కప్‌లో తొలిరోజు ఆతిథ్య భారత షూటర్లు అదరగొట్టారు. స్టార్ షూటర్ మనూభాకర్ను వెనక్కి నెట్టిన యశస్విని సింగ్ దేశ్వాల్ వరల్డ్‌కప్ షూటింగ్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో యశస్విని 238.8 పాయింట్లతో టైటిల్ సాధించింది. మనూభాకర్ (236.7) రజతం, విక్టోరియా చైకా (బెలారస్, 215.9) కాంస్యం దక్కించుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో దివ్యాన్ష్ సింగ్ పన్వర్ కాంస్య పతకం నెగ్గాడు. ఇక పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో సౌరబ్ చౌదురి రజతం, అభిషేక్ వర్మ కాంస్య పతకం గెలుపొందారు.
ముగ్గురు షూటర్లకు పాజిటివ్: ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న షూటర్లలో శనివారం మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు భారత షూటర్లున్నారు. తాజా ముగ్గురితో కలిపి టోర్నీలో కొవిడ్ సోకినషూటర్ల సంఖ్య నాలుగుకు చేరింది.