ఐపీఎల్‌పై మనసులో మాట బయటపెట్టేసిన అజాజ్ పటేల్
ABN , First Publish Date - 2021-12-08T00:18:43+05:30 IST
న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై మనసులోని మాటను బయటపెట్టేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మనసులోని మాటను బయటపెట్టేశాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు ఇష్టపడతానని పేర్కొన్నాడు. అవకాశం తన తలుపులు తడితే కనుక తప్పకుండా ఆడతానని చెప్పాడు. ఇండియాలో ఐపీఎల్‌లో ఆడడం చాలా గొప్ప విషయమని అన్నాడు. అవకాశం వస్తే కనుక ఐపీఎల్ ఆడేందుకు ఇష్టపడతానని ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్సర్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ చాలా అద్భుతమైన టోర్నమెంటు అని, ప్రతి ఒక్కరు దానిని చాలా దగ్గరి నుంచి అనుసరిస్తుంటారని అజాజ్ పేర్కొన్నాడు. ఇది ఎంతో ఆనందాన్ని, మరెంతో థ్రిల్‌ను అందిస్తుందని ప్రశంసించాడు. కాగా, భారత్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన చివరిదైన రెండో టెస్టు భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చిన అజాజ్.. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఒక ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అజాజ్ అద్భుతమైన ప్రతిభ చూపినప్పటికీ ఆ మ్యాచ్‌లో కివీస్ 372 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.