చరిత్రకు అడుగు దూరంలో..

ABN , First Publish Date - 2021-11-28T08:41:05+05:30 IST

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించేందుకు భారత ఆటగాళ్లు అడుగుదూరంలో నిలిచారు.

చరిత్రకు అడుగు దూరంలో..

ప్రపంచ టీటీ

 క్వార్టర్స్‌లో భారత జట్లు

హూస్టన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించేందుకు భారత ఆటగాళ్లు అడుగుదూరంలో నిలిచారు. మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌లో రౌండ్‌-16లో మనికా బత్రా/అర్చనా కామత్‌ జంట 3-1తో మదారజ్‌/జార్జినా (హంగరీ) ద్వయంపై గెలిచింది. మిక్స్‌డ్‌ ప్రీక్వార్టర్స్‌లో మనికా/సాథియన్‌ జోడీ 3-2తో కనక్‌ ఝా (అమెరికా)/వాంగ్‌ (చైనా) జంటపై నెగ్గింది. టోర్నీ సెమీఫైనల్లో ఓడిన రెండు జంటలకు కాంస్య పతకాలు అందజేస్తారు. దీంతో భారత జోడీలు తమ విభాగాల్లో మరొక్క విజయం సాధిస్తే పతకాలు దక్కుతాయి. 

Updated Date - 2021-11-28T08:41:05+05:30 IST