టైటిల్‌కు అడుగు దూరంలో కార్ల్‌సన్‌

ABN , First Publish Date - 2021-12-09T09:28:09+05:30 IST

వరల్డ్‌ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ రెండోసారి ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు.

టైటిల్‌కు అడుగు దూరంలో కార్ల్‌సన్‌

దుబాయ్‌: వరల్డ్‌ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ రెండోసారి ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. బుధవారం జరిగిన పదో గేమ్‌లో 41 ఎత్తుల తర్వాత కార్ల్‌సన్‌-ఇయాన్‌ నెపోమినియాచి (రష్యా) డ్రాకు అంగీకరించారు. దీంతో  7 డ్రాలు, 3 విజయాలతో కార్ల్‌సన్‌ మొత్తం 6.5 పాయింట్లతో టైటిల్‌ దిశగా సాగుతున్నాడు. మొత్తం 14 రౌండ్లపాటు జరగనున్న ఈ టోర్నీలో ముందుగా 7.5 పాయింట్లు సాధించే వారు విజేతగా నిలుస్తారు. ఈ లెక్కన కార్ల్‌సన్‌ తదుపరి గేమ్‌లో గెలిస్తే టైటిల్‌ అతడి సొంతమవుతుంది. ఇయాన్‌ 3.5 పాయింట్లతో ఉన్నాడు.

Updated Date - 2021-12-09T09:28:09+05:30 IST