టైటిల్‌కు చేరువలో కార్ల్‌సన్‌

ABN , First Publish Date - 2021-12-08T09:10:17+05:30 IST

టైటిల్‌కు చేరువలో కార్ల్‌సన్‌

టైటిల్‌కు చేరువలో కార్ల్‌సన్‌

దుబాయ్‌: మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు మ రింత చేరువయ్యాడు. ఈ నార్వే గ్రాండ్‌మాస్టర్‌ టోర్నీలో మూడో విజయం నమోదు చేశాడు. మంగళ వారం జరిగిన తొమ్మిదో గేమ్‌లో కార్ల్‌సన్‌ 39 ఎత్తుల్లో ప్రత్యర్థి ఇయాన్‌ నెపోమినియాచి (రష్యా)ని ఓడించి తన పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకున్నాడు. మొత్తం 14 రౌండ్లు జరగనున్న ఈ టోర్నీలో ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. 

Updated Date - 2021-12-08T09:10:17+05:30 IST