ఆసీస్‌తో సిరీస్.. విండీస్ వన్డే జట్టులోకి కాట్రెల్, చేజ్, హెట్మెయిర్

ABN , First Publish Date - 2021-07-08T22:35:34+05:30 IST

ఆస్ట్రేలియాతో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టును ప్రకటించింది. పేసర్ షెల్డన్ కాట్రెల్

ఆసీస్‌తో సిరీస్.. విండీస్ వన్డే జట్టులోకి కాట్రెల్, చేజ్, హెట్మెయిర్

బార్బడోస్: ఆస్ట్రేలియాతో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టును ప్రకటించింది. పేసర్ షెల్డన్ కాట్రెల్, బ్యాట్స్‌మన్ షిమ్రన్ హెట్మెయిర్, ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్‌‌లు జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నారు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ నెల 20, 22, 24 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. 2016 ముక్కోణపు టోర్నీ పర్యటన తర్వాత ఆసీస్ జట్టు విండీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి. రేపటి నుంచే టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ సెయింట్ లూసియాలోనే జరుగుతాయి. 


వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), షాయ్ హోప్, ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, షిమ్రన్ హెట్మెయిర్, జేసన్ హోల్డర్, అకల్ హోసీన్, అల్జారీ జోసెఫ్, ఎవిన్ లూయిస్, జేసన్ మహమ్మద్, అండర్సన్ ఫిలిప్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్. 

Updated Date - 2021-07-08T22:35:34+05:30 IST