వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్‌కు కరోనా
ABN , First Publish Date - 2021-01-15T17:34:31+05:30 IST
బంగ్లాదేశ్‌లో వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్‌కు కరోనా సోకింది....
బంగ్లాదేశ్‌లో వెస్టిండీస్ లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ జూనియర్‌కు కరోనా సోకింది. కరోనా సోకడంతో హేడెన్ వాల్ష్ బంగ్లాదేశ్ తో జరగబోయే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వాల్ష్ కు రెండు సార్లు పరీక్షించాక పాటిటివ్ గా తేలింది. దీంతో వాల్ష్ ను క్వారంటైన్‌కు తరలించారు. వెస్టిండీస్ టూరింగ్ స్క్వాడ్లలో మిగతా సభ్యులకు నాలుగు సార్లు పరీక్షలు చేసిన తర్వాత రెండు సార్లు నెగిటివ్ అని తేలింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జనవరి 20వతేదీ నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్ ఇతర జట్టు సభ్యులతో వాల్ష్ కు ఎలాంటి సంబంధం లేదని వెస్టిండీస్ తెలిపింది.