pak జట్టుతో టీమిండియా ఆడకూడదు... బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్వీట్
ABN , First Publish Date - 2021-10-25T16:58:57+05:30 IST
ఉగ్రవాద రాజ్యమైన పాకిస్థాన్ తో మన టీమిండియా జట్టు క్రికెట్ ఆడకూడదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్వీట్ చేశారు...

న్యూఢిల్లీ : ఉగ్రవాద రాజ్యమైన పాకిస్థాన్ తో మన టీమిండియా జట్టు క్రికెట్ ఆడకూడదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్వీట్ చేశారు.ప్రతీరోజు అమాయక పౌరులను చంపేస్తున్న దురాక్రమణదారు అయిన పాకిస్థాన్ తో మనం ఆడకూడదని స్వామి పేర్కొన్నారు. బీసీసీఐలో నిర్ణయాధికారికి 2021 సంవత్సరానికి బుద్ధుని బిరుదు ఇవ్వాలని స్వామి ట్వీట్ చేశారు.ఆదివారం దుబాయ్లో జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత పలువురు రాజకీయ నాయకులు ట్విట్లు చేశారు. ‘‘గెలుపు ఓటములు అన్నీ ఆటలో భాగం. మీరు పుంజుకొని, ప్రపంచ కప్ గెలవడానికి టీమిండియా కోసం రూటింగ్. రాబోయే మ్యాచ్లకు ఆల్ ది బెస్ట్ టీం ఇండియా’’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఫలితాన్ని తిప్పికొడుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.