కోహ్లీసేన.. మళ్లీ నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2021-12-07T06:01:58+05:30 IST

టెస్ట్‌ చాంపియన్స్‌ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రపీఠాన్ని దక్కించుకుంది

కోహ్లీసేన.. మళ్లీ నెంబర్‌వన్‌

దుబాయ్‌: టెస్ట్‌ చాంపియన్స్‌ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సోమవారం విడుదల చేసిన తాజా టెస్ట్‌ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 124 రేటింగ్‌ పాయింట్లతో నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటిదాకా టాప్‌లో కొనసాగిన కివీస్‌ 121 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయింది. ఆస్ట్రేలియా (108) మూడు, ఇంగ్లండ్‌ (107) నాలుగు, పాకిస్థాన్‌ (92) ఐదో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా (88), శ్రీలంక (83), వెస్టిండీస్‌ (75), బంగ్లాదేశ్‌ (49), జింబాబ్వే (31) తర్వాతి ర్యాంకుల్లో నిలిచాయి. ఇక, ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్‌ 42 పాయింట్లు, 58.33 విజయశాతంతో మూడో స్థానంలో ఉంది. శ్రీలంక టాప్‌లో, పాకిస్థాన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. 


Updated Date - 2021-12-07T06:01:58+05:30 IST