2010 దశాబ్దపు విజ్డన్ అల్మానక్స్ వన్డే క్రికెటర్‌గా కోహ్లీ

ABN , First Publish Date - 2021-04-15T23:46:55+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోమ్లీ 2010 దశాబ్దపు విజ్డన్ అల్మానక్‌ వన్డే క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఈ దశాబ్దంలో కోహ్లీ 11 వేలకు పైగా పరుగులు చేశాడు. 60 శాతానికి పైగా సగటుతో 42 సెంచరీలు సాధించాడు.

2010 దశాబ్దపు విజ్డన్ అల్మానక్స్ వన్డే క్రికెటర్‌గా కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ 2010 దశాబ్దపు విజ్డన్ అల్మానక్‌ వన్డే క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఈ దశాబ్దంలో కోహ్లీ 11 వేలకు పైగా పరుగులు చేశాడు. 60 శాతానికి పైగా సగటుతో 42 సెంచరీలు సాధించాడు. 2011లో ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ గెలవడంతో అతడికి ఈ దశాబ్దం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండేళ్లకు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ దశాబ్దంలో ఐదు ఐసీసీ 50 ఓవర్ టోర్నమెంట్లు జరగ్గా కోహ్లీ/ ఇండియా ఎప్పుడూ సెమీఫైనల్ ముందు నిష్కృమించలేదు.


ఇక, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ 2020లో విజ్డన్ ప్రపంచ లీడింగ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్, పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్ వర్ధమాన క్రికెటర్లు డామ్ సిబ్లీ, జేక్ క్రాలీ, 44 ఏళ్ల డారెన్ స్టీవెన్స్‌లు ‘ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యారు. 


ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ బెత్ మూనీ లీడింగ్ విమెన్ క్రికెటర్‌గా ఎంపికవగా, విండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ లీడింగ్ టీ20 క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. కాగా, ఇటీవల ఐసీసీఐ కోహ్లీని ఈ దశాబ్దపు క్రికెటర్‌గా ఎంపిక చేసింది. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్’గాను ప్రకటించింది. అలాగే, ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది డికేడ్ కెప్టెన్‌గానూ కోహ్లీ ఎంపికయ్యాడు.  

Updated Date - 2021-04-15T23:46:55+05:30 IST