రూట్‌కు కోహ్లీ మసాజ్‌

ABN , First Publish Date - 2021-02-06T10:00:20+05:30 IST

తొలి రోజు ఆట ఆఖర్లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కాసేపు ఫిజియో అవతారమెత్తాల్సి వచ్చింది.

రూట్‌కు కోహ్లీ మసాజ్‌

తొలి రోజు ఆట ఆఖర్లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కాసేపు ఫిజియో అవతారమెత్తాల్సి వచ్చింది. 86వ ఓవర్‌లో జో రూట్‌ భారీ సిక్సర్‌ బాదిన వెంటనే కుడి కాలి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. దీంతో ఫిజియో వచ్చేలోపు కోహ్లీ అతడి బాధను చూడలేక కాలిని పైకి లేపి పాదాన్ని పట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని ఐసీసీ ట్వీట్‌ చేస్తూ కోహ్లీ క్రీడా స్ఫూర్తిని కొనియాడింది.

Updated Date - 2021-02-06T10:00:20+05:30 IST