కోహ్లీ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్.. ఆకాశానికెత్తేసిన టీమిండియా మాజీ క్రికెటర్

ABN , First Publish Date - 2021-12-31T22:57:11+05:30 IST

దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు విజయం సాధించిన తర్వాత కెప్టెన్ కోహ్లీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి..

కోహ్లీ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్.. ఆకాశానికెత్తేసిన టీమిండియా మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు విజయం సాధించిన తర్వాత కెప్టెన్ కోహ్లీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విజయంతో తాను ‘ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్’నని కోహ్లీ తనను తాను నిరూపించుకున్నాడని మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక, కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ సిరీస్‌లో పాత కోహ్లీని చూస్తామని కాంబ్లీ ట్వీట్ చేశాడు.  


వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత సారథ్యం వహించిన తొలి టెస్టులో కోహ్లీ జట్టుకు రికార్డు విజయాన్ని అందించాడు. ఫలితంగా సెంచూరియన్‌లో జట్టుకు విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. కాగా, కోహ్లీ వరుసగా రెండోసారి ఒక్క సెంచరీ కూడా చేయకుండానే ఏడాదిని ముగించాడు. సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 

Updated Date - 2021-12-31T22:57:11+05:30 IST