‘హజారే’లో హైదరాబాద్‌ బోణీ

ABN , First Publish Date - 2021-12-09T09:29:08+05:30 IST

ఆఫ్‌ స్పిన్నర్‌ తిలక్‌ వర్మ (4/23), మీడియం పేసర్‌ రవితేజ (3/23) చెలరేగడంతో విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌ శుభారంభం

‘హజారే’లో హైదరాబాద్‌ బోణీ

ముల్లన్‌పూర్‌ (పంజాబ్‌): ఆఫ్‌ స్పిన్నర్‌ తిలక్‌ వర్మ (4/23), మీడియం పేసర్‌ రవితేజ (3/23) చెలరేగడంతో విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌ శుభారంభం చేసింది. బుధవారం ఎలైట్‌ గ్రూప్‌-సిలో హరియాణాపై 5 వికెట్లతో గెలిచింది. తొలుత హరియాణా 39.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ అజేయ అర్ధ సెంచరీ (77)తో హైదరాబాద్‌ 41 ఓవర్లలో  167/5 స్కోరు చేసి నెగ్గింది. 

Updated Date - 2021-12-09T09:29:08+05:30 IST