నాలుగేళ్లలో రూ. 32 కోట్లు

ABN , First Publish Date - 2021-12-08T09:16:16+05:30 IST

గత నాలుగేళ్ల కాలంలో భారత పారాలింపిక్‌ కమిటీ (పీసీఐ)కి రూ. 32 కోట్లు పైగా నిధులు అందజేశామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

నాలుగేళ్లలో రూ. 32 కోట్లు

పీసీఐకి అందజేశామన్న మంత్రి ఠాకూర్‌


న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల కాలంలో భారత పారాలింపిక్‌ కమిటీ (పీసీఐ)కి రూ. 32 కోట్లు పైగా నిధులు అందజేశామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ’పారా క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే గడచిన నాలుగేళ్లలో జాతీయ క్రీడాసమాఖ్యలకు ఇచ్చే నిధుల కింద పీసీఐకి రూ. 32 కోట్లు ఇచ్చాం. టాప్స్‌ పథకం కింద గతేడాది పారా అథ్లెట్ల కోసం రూ. 10.50 కోట్లు ఖర్చు చేశాం’ అని ఠాకూర్‌ తెలిపారు. ఈ ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు 19 పతకాలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.  



Updated Date - 2021-12-08T09:16:16+05:30 IST