అజాజ్ పటేల్‌కు బ్లూ టిక్ ఇవ్వమన్న అశ్విన్.. వెంటనే ఇచ్చేసిన ట్విట్టర్

ABN , First Publish Date - 2021-12-08T02:12:09+05:30 IST

న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ కోసం టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన సిఫార్సుకు ట్విట్టర్ వెంటనే గ్రీన్ సిగ్నల్

అజాజ్ పటేల్‌కు బ్లూ టిక్ ఇవ్వమన్న అశ్విన్.. వెంటనే ఇచ్చేసిన ట్విట్టర్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ తాజా సంచలనం అజాజ్ పటేల్ కోసం టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన సిఫార్సుకు ట్విట్టర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అజాజ్‌కు ట్విట్టర్ ఖాతా ఉన్నప్పటికీ అతడికి వెరిఫైడ్ మార్క్ అయిన బ్లూటిక్ లేదు. అజాజ్ ట్విట్టర్ ఖాతా వెరిఫైడ్ కాదన్న విషయాన్ని గుర్తించిన అశ్విన్ వెంటనే ట్విట్టర్‌కు ఓ సిఫార్సు పంపాడు. అజాజ్ ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్ ఇవ్వాలంటూ ట్విట్టర్ వెరిఫైడ్ విభాగానికి విజ్ఞప్తి చేశాడు.


అంతేకాదు, భారత్‌తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన అజాజ్ ఇప్పుడో సెలబ్రిటీ అని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. అశ్విన్ విజ్ఞప్తిని పరిశీలించిన ట్విట్టర్ వెరిఫైడ్ విభాగం అజాజ్‌ పటేల్ ఖాతాను సమీక్షించి వెంటనే బ్లూటిక్ ఇచ్చింది. తన విజ్ఞప్తిని పరిశీలించి బ్లూటిక్ ఇచ్చినందుకు ట్విట్టర్ వెరిఫైడ్ విభాగానికి అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు, అజాజ్ కూడా ట్విట్టర్‌కు, అశ్విన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

Updated Date - 2021-12-08T02:12:09+05:30 IST