విజృంభించిన ట్రంపెల్‌మన్‌

ABN , First Publish Date - 2021-10-28T07:36:47+05:30 IST

: రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ బంతితో, స్మిట్‌ బ్యాట్‌తో రాణించడంతో.. ఆసక్తికరంగా సాగిన పసికూనల పోరులో తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ ఆడుతున్న....

విజృంభించిన ట్రంపెల్‌మన్‌

స్కాట్లాండ్‌పై నమీబియా గెలుపు


అబుధాబి: రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ బంతితో, స్మిట్‌ బ్యాట్‌తో రాణించడంతో.. ఆసక్తికరంగా సాగిన పసికూనల పోరులో తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ ఆడుతున్న నమీబియా విజయం సాధించింది. గ్రూప్‌-2లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నమీబియా 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’  ట్రంపెల్‌మన్‌ (3/17) చెలరేగడంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 109/8 పరుగులకే పరిమితమైంది. మైకేల్‌ లీస్క్‌ (44), క్రిస్‌ గ్రీవ్స్‌ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జాన్‌ ఫ్రైలింక్‌ (2/10) పొదుపైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఛేదనలో నమీబియా 19.1 ఓవర్లలో 115/6 స్కోరు చేసి నెగ్గింది. స్మిట్‌ (32 నాటౌట్‌), విలియమ్స్‌ (23) విజయంలో కీలకపాత్ర పోషించారు. లీస్క్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 

స్మిట్‌ జోరు: లక్ష్య ఛేదనలో నమీబియా ఓపెనర్లు క్రెయిగ్‌ విలియమ్స్‌, మైకేల్‌ వాన్‌ (18) మంచి ఆరంభాన్నే అందించారు. అయితే, వాన్‌ను అవుట్‌ చేసిన షరీఫ్‌.. తొలి వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. గ్రీన్‌ (9), కెప్టెన్‌ ఎరాస్మస్‌ (4) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. వాట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ముందుకు వచ్చిన విలియమ్స్‌.. స్టంపౌటయ్యాడు. ఈ దశలో స్మిట్‌ ధాటిగా ఆడడంతో స్కోరు వేగం పెరిగింది. లీస్క్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన వీస్‌.. మరోసారి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. చివరి 14 బంతుల్లో 8 పరుగులు కావాల్సి ఉండగా.. స్మిట్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 


బ్యాటింగ్‌ విలవిల: పేసర్‌ ట్రంపెల్‌మన్‌ దెబ్బకు టాపార్డర్‌ వికెట్లను చేజార్చుకున్న స్కాట్లాండ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌.. ట్రంపెల్‌మన్‌ వేసిన తొలి ఓవర్‌లో ఓపెనర్‌ మున్సే (0), మెక్‌లాడ్‌ (0), బేరింగ్టన్‌ (0) వికెట్లను కోల్పోయింది. వాలెస్‌ (4)ను వీస్‌ ఎల్బీ చేయడంతో 18/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, లీస్క్‌, మరో ఓపెనర్‌ క్రాస్‌ (19) ఐదో వికెట్‌కు 39 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. క్రాస్‌ను ఫ్రైలింక్‌ బౌల్డ్‌ చేశాడు. గ్రీవ్స్‌ సహకారంతో లీస్క్‌ టీమ్‌ స్కోరును సెంచరీకి చేరువగా తీసుకెళ్లాడు.  


స్కోరుబోర్డు

స్కాట్లాండ్‌: జార్జ్‌ మున్సే (బి) ట్రంపెల్‌మన్‌  0, మాథ్యూ క్రాస్‌ (బి) ఫ్రైలింక్‌ 19, క్యాలమ్‌ మెక్‌లాడ్‌ (సి) గ్రీన్‌ (బి) ట్రంపెల్‌మన్‌ 0, రిచి బేరింగ్టన్‌ (ఎల్బీ) ట్రంపెల్‌మన్‌ 0, క్రెయిగ్‌ వాలెస్‌ (ఎల్బీ) వీస్‌ 4, మైకేల్‌ లీస్క్‌ (బి) స్మిట్‌ 44, క్రిస్‌ గ్రీవ్స్‌ (రనౌట్‌/వీస్‌) 25, మార్క్‌ వాట్‌ (సి) ఎరాస్మస్‌ (బి) ఫ్రైలింక్‌ 3, జోష్‌ డెవె (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 109/8; వికెట్ల పతనం: 1-0, 2-2, 3-2, 4-18, 5-57, 6-93, 7-99, 8-109; బౌలింగ్‌: రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ 4-0-17-3, జాన్‌ ఫ్రైలింక్‌ 4-0-10-2, జేజే స్మిట్‌ 4-0-20-1, డేవిడ్‌ వీస్‌ 4-0-22-1, బెర్నార్డ్‌ షోల్జ్‌ 2-0-16-0, మైకేల్‌ వాన్‌ లీగెన్‌ 1-0-12-0,  పిక్కి య ఫ్రాన్స్‌ 1-0-7-0. 


నమీబియా: క్రెయిగ్‌ విలియమ్స్‌ (స్టంప్డ్‌) క్రాస్‌ (బి) వాట్‌ 23, మైకేల్‌ వాన్‌ లీగెన్‌ (సి) బేరింగ్టన్‌ (బి) షరీఫ్‌ 18, జేన్‌ గ్రీన్‌ (సి) మున్సే (బి) గ్రీవ్స్‌ 9, ఎరాస్మస్‌ (బి) లీస్క్‌ 4, డేవిడ్‌ వీస్‌ (సి) వాట్‌ (బి) లీస్క్‌ 16, స్మిట్‌ (నాటౌట్‌) 32, ఫ్రైలింక్‌ (సి) మెక్‌లాడ్‌ (బి) వీల్‌ 2, పిక్కీ య ఫ్రాన్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 19.1 ఓవర్లలో 115/6; వికెట్ల పతనం: 1-28, 2-50, 3-61, 4-67, 5-102, 6-109; బౌలింగ్‌: బ్రాడ్‌ వీల్‌ 4-0-14-1, జోష్‌ డెవె 2-0-15-0, సఫ్యాన్‌ షరీఫ్‌ 3.1-0-21-1, క్రిస్‌ గ్రీవ్స్‌ 4-0-22-1, మార్క్‌ వాట్‌ 4-0-22-1, మైకేల్‌ లీస్క్‌ 2-0-12-2. 

Updated Date - 2021-10-28T07:36:47+05:30 IST