వాటీజ్ దిస్ పుజారా! రెండు సార్లు అతడి చేతిలో.. అదే మైదానంలో..
ABN , First Publish Date - 2021-12-27T01:16:50+05:30 IST
టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా పేలవ ఫామ్ కొనసాగుతోంది. కివీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో తీవ్రంగా

సెంచూరియన్: టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా పేలవ ఫామ్ కొనసాగుతోంది. కివీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన పుజారా.. సౌతాఫ్రికాతో సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో మరోమారు అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు.
మయాంక్ అగర్వాల్ (60) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి వేసిన బంతిని ఎదుర్కోవడంలో తడబడిన పుజారా.. కీగన్ పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
సౌతాఫ్రికా గడ్డపై పుజారాకు ఇది రెండో డకౌట్ కాగా, రెండుసార్లు ఎంగిడి బౌలింగ్‌లోనే అవుట్ కావడం గమనార్హం. 2017-18లో ఇదే వేదికపై జరిగిన రెండో టెస్టులో ఎంగిడి బౌలింగులోనే పుజారా రనౌట్ అయి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తాజాగా, మరోసారి అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. పుజారా గోల్డెన్ డక్‌పై అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.