హార్దిక్‌ ఫిట్‌నెస్‌పై విచారణ ?

ABN , First Publish Date - 2021-11-09T06:00:15+05:30 IST

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో లేడా? అతడి ఫిట్‌నెస్‌ విషయాన్ని జట్టు యాజమాన్యం, సెలెక్షన్‌ కమిటీ దాచిపెట్టిందా? ఆ విషయమై బోర్డు గరంగరంగా ఉందా..అంటే అవుననే సమాధానం వస్తోంది.

హార్దిక్‌ ఫిట్‌నెస్‌పై విచారణ ?

టీమ్‌ను నివేదిక కోరనున్న బీసీసీఐ 

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో లేడా? అతడి ఫిట్‌నెస్‌ విషయాన్ని జట్టు యాజమాన్యం, సెలెక్షన్‌ కమిటీ దాచిపెట్టిందా? ఆ విషయమై బోర్డు గరంగరంగా ఉందా..అంటే అవుననే సమాధానం వస్తోంది. హార్దిక్‌ ఫిట్‌నె్‌సపై విచారణ జరిపించాలని భావిస్తున్న బీసీసీఐ, అందుకు సంబంధించిన వివరాలపై జట్టు యాజమాన్యాన్ని నివేదిక  కోరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20లకు హార్దిక్‌కు ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. ‘పాండ్యా ఫిట్‌నె్‌సపై సెలెక్షన్‌ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్‌ను నివేదిక అడగనున్నాం’ అని బోర్డు అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. గత నవంబరులో ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల మ్యాచ్‌ బౌలింగ్‌ నుంచి వైదొలగినప్పటినుంచి హార్దిక్‌ ఫిట్‌నె్‌సపై చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో అర్హులను కాదని అతడికి టీ20 ప్రపంచ కప్‌ జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 

Updated Date - 2021-11-09T06:00:15+05:30 IST