అర్జున్, అర్వింద్‌కు ‘టోక్యో’ బెర్త్
ABN , First Publish Date - 2021-05-08T09:20:35+05:30 IST
భారత రోవర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ టోక్యో ఒలింపిక్స్ టిక్కెట్ దక్కించుకొన్నారు.

టోక్యో: భారత రోవర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ టోక్యో ఒలింపిక్స్ టిక్కెట్ దక్కించుకొన్నారు. టోక్యోలో శుక్రవారం జరిగిన ఆసియా-ఓసియానియా కాంటినెంటల్ క్వాలిఫయింగ్ రెగట్టా టోర్నమెంట్లో పురుషుల లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ ఫైనల్లో అర్జున్-అర్వింద్ జోడీ రెండో స్థానంలో నిలిచింది. రెగెట్టాలో ఐదు ఒలింపిక్స్ కోటా బెర్త్‌లు ఉండగా భారత్ నుంచి డబుల్స్‌లో ఈ జోడీ మాత్రమే ‘టోక్యో’కు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్ స్కల్స్ ఫైనల్లో జకర్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు.