T20 World Cup : నేడు స్కాట్లాండ్తో టీమిండియా పోరు.. ఇంకా సజీవంగానే సెమీస్ అవకాశాలు
ABN , First Publish Date - 2021-11-05T13:06:48+05:30 IST
టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా నేడు స్కాట్లాండ్తో తలపడనుంది...

అబుధాబి: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా నేడు స్కాట్లాండ్తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 07:30 గంటలకు ప్రారంభం కానుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలాపడ్డ టీమిండియా.. అఫ్ఘానిస్థాన్‌పై నెగ్గి టోర్నీలో తొలి విజయం నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సాంకేతికంగా ఇంకా సజీవంగానే ఉన్నాయి.
స్కాట్లాండ్, నమీబియా మ్యాచ్‌ల్లో భారీ విజయాలపై భారత్ కన్నేసింది. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. అలాగే న్యూజిలాండ్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా.. భారత్‌కు మంచి అవకాశాలుంటాయి. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లు గెలవడం అంత కష్టమేమి కాదు కానీ.. కివిస్ తన ఆఖరి మ్యాచ్‌ల్లో ఓడిపోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే, ప్రస్తుతం న్యూజిలాండ్ మంచి ఫామ్‌లో ఉంది. అయితే, టీ20 క్రికెట్లో ఏమైనా జరగొచ్చు. ప్రస్తుతం భారత అభిమానుల దృష్టంతా.. అఫ్ఘాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌పైనే. ఆ మ్యాచ్‌లో కివీస్ ఓడిందంటే, భారత్‌కు సెమీస్‌కు చేరే అవకాశం లభిస్తుంది. కాగా.. ఇప్పటికే 4 విజయాలతో పాకిస్థాన్ సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.
