పట్టుబిగిస్తున్న లంక

ABN , First Publish Date - 2021-05-02T09:42:58+05:30 IST

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక పట్టుబిగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 469/6తో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 493/7 వద్ద డిక్లేర్‌ చేసింది.

పట్టుబిగిస్తున్న లంక

కాండీ: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక పట్టుబిగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 469/6తో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 493/7 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాటింగ్‌ వైఫల్యంతో 251 పరుగులకే కుప్పకూలింది. తమీమ్‌ ఇక్బాల్‌ (92), కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (49), ముష్ఫీకర్‌ రహీమ్‌ (40) రాణించారు. స్పిన్నర్‌ ప్రవీణ్‌ జయవిక్రమ (6/92) ఆరు వికెట్లు పడగొట్టాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆట చివరకు లంక 17/2 స్కోరు చేసింది.

Updated Date - 2021-05-02T09:42:58+05:30 IST