మయాంక్‌పైనే కళ్లన్నీ..
ABN , First Publish Date - 2021-07-20T09:00:35+05:30 IST
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీ్‌సకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సన్నాహకాలను ఆరంభించింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి కౌంటీ సెలెక్ట్ లెవన్ జట్టుతో మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది...
- కౌంటీ లెవన్‌తో టీమిండియా వామప్ నేటి నుంచి
డర్హమ్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీ్‌సకు విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సన్నాహకాలను ఆరంభించింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి కౌంటీ సెలెక్ట్ లెవన్ జట్టుతో మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. దీనికి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ హోదా ఇవ్వడం విశేషం. చాలా ఏళ్ల తర్వాత టీమిండియా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతోంది. కాగా, రిషభ్ పంత్ ఐసోలేషన్‌లో ఉండడంతో.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టీమ్‌లో చోటుకోసం ప్రయత్నిస్తున్న మయాంక్ అగర్వాల్‌పై అందరి దృష్టీ నెలకొంది. శుభ్‌మన్ గిల్ గాయపడడంతో ఓపెనర్ రోహిత్‌కు జోడీగా మయాంక్‌ను మేనేజ్మెంట్ పరీక్షించనుంది. పేసర్లు సిరాజ్, బుమ్రాకు కూడా మంచి ప్రాక్టీస్ లభించనుంది. పంత్ క్వారంటైన్ ముగిసినా.. అతడు టీమ్ బయోబబుల్‌లోకి ఇంకా చేరలేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ వచ్చే నెల 4 నుంచి జరగనుంది.