చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడి

ABN , First Publish Date - 2021-11-01T04:07:25+05:30 IST

న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శనతో నిరాశపరిచింది. చెత్త ఆడి చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌లో..

చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడి

దుబాయ్: న్యూజిల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శనతో నిరాశపరిచింది. చెత్త ఆడి చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస పరుగులు చేయలేకపోయారు. రవీంద్ర జడేజా(26) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 110 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు గప్తిల్(20), డైరిల్ మిచెల్(49) పటిష్ఠమైన ఓపెనింగ్ ఇచ్చారు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(33 నాటౌట్) విన్నింగ్ రన్స్ నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత బైలర్లలో బుమ్రా మాత్రమే 2 వికెట్లు తీశాడు.


కాగా.. ఈ మ్యాచ్ ఓటమితో టీమిండియా సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైనట్లే. మిగతా మూడు జట్లూ చిన్న జట్లు కావడంతో వాటిపై కివీస్, పాక్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ నమీబియా కానీ, స్కాట్ ల్యాండ్ కానీ పాక్ లేదా కివీస్‌ను ఓడిస్తే.. అప్పుడు టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

Updated Date - 2021-11-01T04:07:25+05:30 IST