ద్యూతీకి ధనలక్ష్మి షాక్
ABN , First Publish Date - 2021-03-17T09:24:54+05:30 IST
భారత మహిళల వంద మీటర్ల రేసులో స్టార్ అథ్లెట్‌గా నీరాజనాలందుకుంటున్న ఒడిశా స్ర్పింటర్ ద్యూతీ చంద్‌కు తమిళనాడు అమ్మాయి ధనలక్ష్మి షాకిచ్చింది...
పటియాలా: భారత మహిళల వంద మీటర్ల రేసులో స్టార్ అథ్లెట్‌గా నీరాజనాలందుకుంటున్న ఒడిశా స్ర్పింటర్ ద్యూతీ చంద్‌కు తమిళనాడు అమ్మాయి ధనలక్ష్మి షాకిచ్చింది. ఇక్కడ మంగళవారం మొదలైన ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 22 ఏళ్ల ధనలక్ష్మి 100 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది. ఫైనల్లో ద్యూతీ చంద్ (11.58 సెకన్లు)ను రజతానికి పరిమితం చేస్తూ ధనలక్ష్మి 11.39 సెకన్లలో రేసు ముగించి స్వర్ణ పతకం అందుకుంది. అర్చనా సుశీంద్రన్ (11.76 సె) కాంస్యం గెలుచుకుంది. ఇక, ఎప్పుడూ 400 మీటర్ల రేసులో పరిగెత్తే హిమాదాస్ ఈసారి వంద మీటర్లలో పోటీపడ్డా నిరాశే ఎదురైంది. ఫాల్స్ స్టార్ట్ చేయడంతో ఆమె రేసు నుంచి అనర్హతకు గురైంది.