భారత్‌తో చర్చలే ఏకైక మార్గం.. తేల్చేసిన పాక్ విదేశాంగ మంత్రి!

ABN , First Publish Date - 2021-04-01T11:21:02+05:30 IST

భారత్‌తో చర్చల గురించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

భారత్‌తో చర్చలే ఏకైక మార్గం.. తేల్చేసిన పాక్ విదేశాంగ మంత్రి!

ఇస్లామాబాద్: భారత్‌తో చర్చల గురించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత్‌తో చర్చలే ముందుకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గమని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడే రెండు దేశాలూ ముందడుగు వేయగలుగుతాయని ఆయన తెలిపారు.


‘‘ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పీఎం మోదీ లేఖ రాయడం, దీనిపై భారత్‌లో దీనిపై విమర్శలు రాకపోవడం, ఆసియా సమ్మిట్‌లో పాకిస్తాన్ కీలకంగా మారడం.. ఇవన్నీ పాజిటివ్ నిర్ణయాలనే నేను భావిస్తా’’ అని ఖురేషీ చెప్పారు. చర్చల విషయంలో పాకిస్తాన్ ఎన్నడూ వెనకడుగు వేయలేదని, భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే తాము రెండడగులు వేస్తామని ఖురేషీ స్పష్టంచేశారు.

Updated Date - 2021-04-01T11:21:02+05:30 IST