సౌతాఫ్రికా గెలుపు

ABN , First Publish Date - 2021-10-19T07:44:56+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 41 పరుగులతో నెగ్గింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేసింది.

సౌతాఫ్రికా గెలుపు

అఫ్ఘాన్‌తో వామప్‌ మ్యాచ్‌

అబుధాబి: అఫ్ఘానిస్థాన్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ వామప్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 41 పరుగులతో నెగ్గింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ బవుమా 31 పరుగులు చేయగా, డేవిడ్‌ మిల్లర్‌ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అఫ్ఘాన్‌ బౌలర్లలో ముజీబుర్‌ రహ్మాన్‌ మూడు వికెట్లు తీయగా, మహ్మద్‌ నబీ, నవీన్‌ ఉల్‌ హక్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో అఫ్ఘానిస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 104 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ నబీ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. రహ్మానుల్లా గుర్బాజ్‌ 19, గుల్బదిన్‌ నైబ్‌ 17 పరుగులు చేశారు. స్పిన్నర్‌ షంసీ మూడు వికెట్లు సాధించాడు. 


సౌతాఫ్రికా:

20 ఓవర్లలో 145/5 (మార్‌క్రమ్‌ 48, బవుమా 31, మిల్లర్‌ నాటౌట్‌ 20, ముజీబుర్‌ రహ్మాన్‌ 3/24).

అఫ్ఘానిస్థాన్‌:

20 ఓవర్లలో 104/8 (నబీ 34 నాటౌట్‌, గుర్బాజ్‌ 19, నైబ్‌ 17, కరీం 16, షంసీ 3/18, ఎన్‌గిడి 2/27).

Updated Date - 2021-10-19T07:44:56+05:30 IST