హరియాణాలో సుశీల్‌ ?

ABN , First Publish Date - 2021-05-21T05:46:56+05:30 IST

హత్య కేసులో ముద్దాయిగా పోలీసు ఎఫ్‌ఐఆర్‌లోకెక్కిన ఒలింపిక్‌ పతక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హరియాణాలోని పలు ప్రాంతాలను మారుస్తూ తిరుగుతున్నట్టు అంచనాకొచ్చారు.

హరియాణాలో సుశీల్‌ ?

పోలీసుల గాలింపు ముమ్మరం

మెరఠ్‌లో కనిపించిన ఫొటోలు


మేరఠ్‌: హత్య కేసులో ముద్దాయిగా పోలీసు ఎఫ్‌ఐఆర్‌లోకెక్కిన ఒలింపిక్‌ పతక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హరియాణాలోని పలు ప్రాంతాలను మారుస్తూ తిరుగుతున్నట్టు అంచనాకొచ్చారు. కాగా..సుశీల్‌ మేరఠ్‌ సమీపంలోని ఓ టోల్‌ప్లాజా వద్ద కారులో కనిపించిన ఫొటోలు పోలీసులకు చేరాయి. అందులో అతడు ముందు సీటులో డ్రైవర్‌ పక్కన కూర్చొని ఉన్నాడు. ఈ  చిత్రాలు ఈనెల 6వ తేదీవిగా వారు గుర్తించారు. అంటే..23 ఏళ్ల రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య జరిగిన మరుసటి రోజువన్నమాట. ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియం వద్ద జరిగిన ఘర్షణలో రెజ్లర్‌ సాగర్‌ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పరారీలో ఉన్న 37 ఏళ్ల సుశీల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇటీవల తిరస్కరించింది. ఇక గతవారం ఢిల్లీ కోర్టు సుశీల్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ చేసింది. 

Updated Date - 2021-05-21T05:46:56+05:30 IST