టోక్యో ఒలింపిక్స్‌కు శ్రీశంకర్
ABN , First Publish Date - 2021-03-17T09:27:03+05:30 IST
భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్...
పటియాలా: భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ 8.26 మీటర్ల ప్రదర్శనతో విజేతగా నిలిచి.. ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఈ క్రమంలో 2018లో తన పేరిటే ఉన్న 8.20 మీటర్ల జాతీయ రికార్డును ఈ కేరళ అథ్లెట్ బద్దలు కొట్టాడు. కాగా, మహ్మద్ అనీస్ యహియా (8 మీటర్లు), లోకేష్ (7.60 మీ) రజత, కాంస్య పతకాలు దక్కించుకొన్నారు. ఇప్పటికే భారత్ నుంచి 20 కిలోమీటర్ల నడకలో ఐదుగురు, ఇద్దరు జావెలిన్ త్రోయర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.