శ్రీకాంత్‌కు ఐదెకరాలు
ABN , First Publish Date - 2021-12-30T07:35:41+05:30 IST
ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ బుధవారం

రూ. 7 లక్షల చెక్
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంగా కిడాంబిని సన్మానించిన సీఎం.. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక బహుమతిగా రూ. 7 లక్షల చెక్‌ను అందజేశారు. అలాగే.. అకాడమీ ఏర్పాటు కోసం తిరుపతిలో అతనికి ఐదెకరాల భూమిని కేటాయించారు. కాగా తనకు కేటాయించిన స్థలంలో అత్యాధునిక వసతులతో అకాడమీని ఏర్పాటు చేసి ప్రపంచస్థాయి షట్లర్లను తయారుచేస్తానని శ్రీకాంత్ తెలిపాడు.