అభిషేక్‌, అజిత్‌ హవా

ABN , First Publish Date - 2021-12-31T09:23:36+05:30 IST

అభిషేక్‌, అజిత్‌ హవా

అభిషేక్‌, అజిత్‌ హవా

జైపూర్‌పై ముంబై గెలుపు జూ ప్రొ. కబడ్డీ లీగ్‌


బెంగళూరు: మాజీ చాంపియన్‌ యు ముంబా మళ్లీ గెలుపు బాట పట్టింది. గత రెండు మ్యాచ్‌ల్లో..ఒక దానిని డ్రా చేసుకొని, మరో పోరులో ఓడిన ముంబా..గురువారం జరిగిన పోటీలో 37-28 స్కోరుతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను చిత్తు చేసింది. రైడర్ల నిలకడైన ప్రదర్శనతో  తొలి అర్థ భాగంలోనే భారీ ఆధిక్యంలో నిలిచిన ముంబా దానిని చివరికంటా కొనసాగించి విజయం అందుకుంది. మరోవైపు జైపూర్‌ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముంబా రైడర్‌ అభిషేక్‌ సింగ్‌ ఈ సీజన్‌లో రెండో సూపర్‌ 10తో సత్తా చాటగా..మరో స్టార్‌ రైడర్‌ అజిత్‌ కుమార్‌ తన అద్భుత ప్రదర్శన కొనసాగించి 11 పాయింట్లు స్కోర్‌ చేశాడు. ఇక జైపూర్‌ జట్టులో అర్జున్‌ దేశ్వాల్‌ ఒక్కడే మెరుగైన ఆటతో 14 పాయింట్లు రాబట్టాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 42-28 స్కోరుతో హరియాణా స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది.  

Updated Date - 2021-12-31T09:23:36+05:30 IST