అదరగొట్టిన రషీద్‌

ABN , First Publish Date - 2021-12-31T09:22:45+05:30 IST

అదరగొట్టిన రషీద్‌

అదరగొట్టిన రషీద్‌

సెమీస్‌లో బంగ్లాపై గెలుపు

తుదిపోరుకు భారత్‌ 

అండర్‌-19 ఆసియాకప్‌


షార్జా: గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ (108 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 90 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ్‌సలో టీమిండియా 103 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. విక్కీ ఓస్వాల్‌ (28 నాటౌట్‌), కెప్టెన్‌ యశ్‌ (26) సహకారం అందించారు.  ఛేదనలో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా 38.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. 

పాక్‌ అవుట్‌..: మరో సెమీ్‌సలో పాకిస్థాన్‌ను శ్రీలంక 22 పరుగుల తేడాతో ఓడించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో లంక 44.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. జమీర్‌ (4/32) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పాక్‌ 49.3 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. మాథ్యూ (4/14), దునిత్‌ (3/31) పాక్‌ బ్యాటింగ్‌ వెన్నువిరిచారు. 


సంక్షిప్త స్కోర్లు: భారత్‌: 50 ఓవర్లలో 243/8 (రషీద్‌ 90 నాటౌట్‌; రకిబుల్‌ 3/41); బంగ్లాదేశ్‌: 38.2 ఓవర్లలో 140 ఆలౌట్‌ (ఆరిఫుల్‌ 42; రవి 2/22, విక్కీ 2/25, రాజ్‌ 2/26, రాజ్‌వర్దన్‌ 2/36). 


నేడే ఫైనల్‌..


స్టార్‌ స్పోర్ట్స్‌లో ఉ.11 నుంచి

 

శ్రీలంకతో శుక్రవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. పాక్‌ లాంటి జట్టును ఓడించి తుదిపోరుకు చేరుకున్న లంక మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్‌ కంటే.. లంక బౌలింగ్‌ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు లంక నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-31T09:22:45+05:30 IST