అరుణను సన్మానించిన దత్తాత్రేయ
ABN , First Publish Date - 2021-12-31T09:29:49+05:30 IST
అరుణను సన్మానించిన దత్తాత్రేయ

న్యూఢిల్లీ: జిమ్నాస్ట్ బుద్ధా అరుణారెడ్డి.. తెలంగాణ, దేశాన్ని గర్వపడేలా చేసిందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. గురువారం చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో దత్తాత్రేయను అరుణ మర్యాదపూర్వకంగా కలుసుకొంది. ఈ సందర్భంగా అరుణను శాలువాతో సన్మానించిన గవర్నర్.. జ్ఞాపికను బహూకరించారు.