హంపికి ఐదో స్థానం

ABN , First Publish Date - 2021-12-31T09:27:02+05:30 IST

హంపికి ఐదో స్థానం

హంపికి ఐదో స్థానం

వార్సా: మహిళల ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షి్‌ప్సలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కొనేరు హంపి టాప్‌-3లో నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ఓవరాల్‌గా 17 రౌండ్లనుంచి 11.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. గురువారం జరిగిన 10, 12, 14, 16 రౌండ్లలో నెగ్గిన హంపి.. 15వ రౌండ్‌ను డ్రాగా ముగించింది. 16 రౌండ్లు ముగిసే సరికి 11.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన హంపి.. చివరి రౌండ్‌లో నెగ్గితే పోడియం ఫినిష్‌ చేసే అవకాశం దక్కేది. కానీ, ఆఖరి రౌండ్‌లో రష్యా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ షువలొవా చేతిలో హంపి పరాజయం పాలైంది. కజకిస్థాన్‌ టీనేజర్‌ అసున్‌బయేవా 14 పాయింట్లతో విజేతగా నిలిచింది.


Updated Date - 2021-12-31T09:27:02+05:30 IST