ఆరునెలల్లో కోడ్‌ను అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-02-05T08:52:30+05:30 IST

రు నెలల్లోపు జాతీయ స్పోర్ట్స్‌కోడ్‌ (క్రీడా నియమావళి)ను అమలు చేయాలని అన్ని క్రీడా సమాఖ్యలకు..

ఆరునెలల్లో కోడ్‌ను అమలు చేయాలి

సమాఖ్యలకు క్రీడా శాఖ డెడ్‌లైన్‌

న్యూఢిల్లీ: ఆరు నెలల్లోపు జాతీయ స్పోర్ట్స్‌కోడ్‌ (క్రీడా నియమావళి)ను అమలు చేయాలని అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా శాఖ అల్టిమేటం జారీ చేసింది. యాటింగ్‌, ఈక్వెస్ట్రియన్‌, పోలో, మోటార్‌స్పోర్ట్స్‌, స్పెషల్‌ ఒలింపిక్‌ ఫెడరేషన్లకు మాత్రం ఏడాదిపాటు వెసులుబాటు కల్పించింది. గడువులోపు స్పోర్ట్స్‌కోడ్‌కు తగినట్టుగా తమ రాజ్యాంగంలో సవరణలు చేయకపోతే నిధులు నిలిపివేయడంతోపాటు గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. 

Updated Date - 2021-02-05T08:52:30+05:30 IST