బట్లర్‌.. బాదుడు

ABN , First Publish Date - 2021-10-31T09:28:52+05:30 IST

టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్‌) తాజా టోర్నీలో వేగవంతమైన అర్ధ శతకంతో చెలరేగడంతో.. శనివారం గ్రూప్‌-1లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్లతో ఆస్ట్రేలియాను

బట్లర్‌.. బాదుడు

  •  ఆసీస్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం


దుబాయ్‌: టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్‌) తాజా టోర్నీలో వేగవంతమైన అర్ధ శతకంతో చెలరేగడంతో.. శనివారం గ్రూప్‌-1లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 8 వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 11.4 ఓవర్ల 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బట్లర్‌, మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (22) తొలి వికెట్‌కు 66 పరుగులతో బలమైన పునాది వేశారు. అయితే, రాయ్‌ను జంపా ఎల్బీ చేయగా.. మలన్‌ (8)ను అగర్‌ అవుట్‌ చేశాడు. కానీ, బెయిర్‌స్టో (16 నాటౌట్‌)తో కలసి బట్లర్‌.. మరో 50 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.


అంతకుముందు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జోర్డాన్‌ (3/17) దెబ్బకు.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు వోక్స్‌, మిల్స్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఓపిగ్గా ఆడిన కెప్టెన్‌ ఫించ్‌ (44).. వేడ్‌ (18)తో కలసి ఐదో వికెట్‌కు 30 పరుగులు, అగర్‌ (20)తో కలసి ఆరో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గౌరవప్రద స్కోరును అందించాడు. ఓపెనర్‌ వార్నర్‌ (1)తో పాటు స్మిత్‌ (1), మ్యాక్స్‌వెల్‌ (6), స్టొయినిస్‌ (0) వికెట్లను వెంటవెంటనే చేజార్చుకొన్న ఆసీస్‌ 21/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, వేడ్‌, అగర్‌ సహకారంతో ఫించ్‌ ఆదుకొన్నాడు. 17వ ఓవర్‌లో అగర్‌ రెండు సిక్స్‌లు, మరుసటి ఓవర్‌లో కమిన్స్‌ రెండు సిక్స్‌లు బాదడంతో టీమ్‌ స్కోరు సెంచరీ దాటింది. కాగా, ఫించ్‌, కమిన్స్‌ను జోర్డాన్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. 


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: వార్నర్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 1, ఫించ్‌ (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్‌ 44, స్మిత్‌ (సి) వోక్స్‌ (బి) జోర్డాన్‌ 1, మ్యాక్స్‌వెల్‌ (ఎల్బీ) వోక్స్‌ 6, స్టొయినిస్‌ (ఎల్బీ) రషీద్‌ 0, వేడ్‌ (సి) రాయ్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 18, అగర్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) మిల్స్‌ 20, కమిన్స్‌ (బి) జోర్డాన్‌ 12, స్టార్క్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 13, జంపా (రనౌట్‌/మిల్స్‌) 1, హాజెల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 125 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-7, 2-8, 3-15, 4-21, 5-51, 6-98, 7-110, 8-110, 9-119; బౌలింగ్‌: రషీద్‌ 4-0-19-1, వోక్స్‌ 4-0-23-2, జోర్డాన్‌ 4-0-17-3, లివింగ్‌స్టోన్‌ 4-0-15-1, మిల్స్‌ 4-0-45-2. 


ఇంగ్లండ్‌: రాయ్‌ (ఎల్బీ) జంపా 22, బట్లర్‌ (నాటౌట్‌) 71, మలన్‌ (సి) వేడ్‌ (బి) అగర్‌ 8, బెయిర్‌స్టో (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 11.4 ఓవర్లలో 126/2; వికెట్ల పతనం: 1-66, 2-97; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-37-0, హాజెల్‌వుడ్‌ 2-0-18-0, కమిన్స్‌ 1-0-14-0, అగర్‌ 2.4-0-15-1, జంపా 3-0-37-1. 

Updated Date - 2021-10-31T09:28:52+05:30 IST