షకీబల్‌ 4/9

ABN , First Publish Date - 2021-08-10T08:53:08+05:30 IST

స్పిన్నర్‌ షకీబల్‌ హసన్‌ (4/9) ధాటికి ఐదో టీ20లో ఆస్ట్రేలియా 62 పరుగులకే కుప్పకూలింది. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డు నమోదు చేసింది.

షకీబల్‌ 4/9

ఆస్ట్రేలియా 62 ఆలౌట్‌

ఐదో టీ20లో బంగ్లా గెలుపు


ఢాకా: స్పిన్నర్‌ షకీబల్‌ హసన్‌ (4/9) ధాటికి ఐదో టీ20లో ఆస్ట్రేలియా 62 పరుగులకే కుప్పకూలింది. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో అత్యల్ప స్కోరు చేసిన చెత్త రికార్డు  నమోదు చేసింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 60 పరుగులతో ఓడిన ఆసీస్‌ ఐదు టీ20ల సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. 123 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో షకీబల్‌తోపాటు, పేసర్‌ మహ్మద్‌ సైఫుద్దీన్‌ (3/12) దెబ్బకు ఆస్ట్రేలియా కుదేలైంది. కెప్టెన్‌ వేడ్‌ (22), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (17) మాత్రమే డబుల్‌ స్కోరు చేశారు. 13.4 ఓవర్లలోనే కంగారూల ఇన్నింగ్స్‌ ముగిసింది. స్లో ట్రాక్‌పై అంతకుముందు తొలుత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 122/8 స్కోరు చేసింది. నయీమ్‌ (23) టాప్‌ స్కోరర్‌. ఇల్లీస్‌, క్రిస్టియన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా..శ్రీలంక పేసర్‌ మలింగ తర్వాత టీ20ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్‌ నిలిచాడు. 

Updated Date - 2021-08-10T08:53:08+05:30 IST