లార్డ్స్‌ టెస్ట్‌కు నన్ను సిద్ధంగా ఉండమన్నారు... కానీ!

ABN , First Publish Date - 2021-08-21T08:17:43+05:30 IST

రెండో టెస్టు ఆరంభానికి ముందు వాతావరణం పొడిగా ఉండడంతో తుది జట్టులో తనను..

లార్డ్స్‌ టెస్ట్‌కు నన్ను సిద్ధంగా ఉండమన్నారు... కానీ!


లండన్‌: రెండో టెస్టు ఆరంభానికి ముందు వాతావరణం పొడిగా ఉండడంతో తుది జట్టులో తనను ఆడించాలనుకున్నారని స్పిన్నర్‌ అశ్విన్‌ తెలిపాడు. ‘ఈ రోజు వేడి గాలులకు అవకాశముంది... ఆడేందుకు సిద్ధంగా ఉండమని మ్యాచ్‌కు ముందు చెప్పారు. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత కూడా ఆకాశం మేఽఘాలతోనే నిండి ఉంది. దీంతో తిరిగి నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తోనే వెళ్లారు. అయితే ఆ వేడి గాలులు వచ్చాకే బెర్త్‌ గురించి చెబితే బావుండేది కదా.. అనవసరంగా ఆ శపడ్డానని మేనేజ్‌మెంట్‌తో అన్నాను’ అని తన యూట్యూబ్‌ చానెల్‌లో అశ్విన్‌ సరదాగా తెలిపాడు.

Updated Date - 2021-08-21T08:17:43+05:30 IST