కష్టాల్లో సఫారీలు
ABN , First Publish Date - 2021-02-06T10:04:54+05:30 IST
పాకిస్థాన్‌తో ఆఖరి, రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అదరగొట్టినా, బ్యాటింగ్‌లో తడబడింది.

తొలి ఇన్నింగ్స్ 106/4
రావల్పిండి: పాకిస్థాన్‌తో ఆఖరి, రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అదరగొట్టినా, బ్యాటింగ్‌లో తడబడింది. ఓవర్‌నైట్ స్కోరు 145/3తో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ మరో 127 రన్స్ జోడించి 272 వద్ద ఆలౌటైంది. అష్రాఫ్ (78 నాటౌట్) రాణించాడు. పేసర్ అన్రిచ్ నోకియా (5/56) ఐదు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహరాజ్ (3/90) మూడు వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు ఆటచివరకు 106/4 స్కోరు చేసి కష్టాల్లో పడ్డారు. ఎల్గర్ (15), మార్‌క్రమ్ (32), వాన్ డీర్ డస్సెన్ (0), డుప్లెసి (17) నిరాశ పర్చారు.