సింగ్‌రాజ్‌కు స్వర్ణం

ABN , First Publish Date - 2021-03-22T06:10:28+05:30 IST

పారా స్పోర్ట్స్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత షూటర్‌ సింగ్‌రాజ్‌ సత్తాచాటాడు. పురుషుల పీ1 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో సింగ్‌రాజ్‌ 236.8 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు...

సింగ్‌రాజ్‌కు స్వర్ణం

  • పారా షూటింగ్‌ ప్రపంచ కప్‌అల్‌ ఇన్‌ (యూఏఈ): పారా స్పోర్ట్స్‌ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత షూటర్‌ సింగ్‌రాజ్‌ సత్తాచాటాడు. పురుషుల పీ1 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో సింగ్‌రాజ్‌ 236.8 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం కొల్లగొట్టాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఇబ్రగిమోవ్‌కు రజతం, టర్కీ షూటర్‌ కొర్హాన్‌ కాంస్య పతకం సాధించారు. మరో భారత షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ నాలుగోస్థానానికి పరిమితమయ్యాడు. ఇక.. పీ3 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ఫైనల్స్‌లో భారత షూటర్‌ రాహుల్‌ జఖార్‌ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నాడు. 


Updated Date - 2021-03-22T06:10:28+05:30 IST