సింధు, శ్రీకాంత్ శుభారంభం
ABN , First Publish Date - 2021-10-20T07:46:00+05:30 IST
టోక్యో ఒలింపిక్స్ తర్వాత తాను పోటీపడుతున్న తొలి టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది.

డెన్మార్క్ ఓపెన్
ఓడెన్స్: టోక్యో ఒలింపిక్స్ తర్వాత తాను పోటీపడుతున్న తొలి టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో నాలుగోసీడ్ సింధు 21-12, 21-10తో టర్కీ షట్లర్ నెస్లిహాన్ ఇగిట్ను అరగంటలోనే చిత్తుచేసింది. సింధు రెండోరౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఓంగ్బామ్రున్పాన్తో ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-11తో భారత్‌కే చెందిన సాయి ప్రణీత్‌పై గెలిచి రెండోరౌండ్ చేరాడు. మరో తొలిరౌండ్ పోరులో సమీర్ వర్మ 21-17, 21-14తో కున్లావత్ వితిసార్న్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 23-21, 21-15తో ఇంగ్లండ్ జంట కాలమ్-స్టీవెన్‌పై, అర్జున్-ధ్రువ్ ద్వయం 21-19, 21-15తో ఇంగ్లండ్‌కు చెందిన 17వ ర్యాంకర్ జోడీ బెన్ లానె-సీన్ వెండీపై గెలిచి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. మరో డబుల్స్ జోడీ సుమిత్-మను అత్రి 18-21, 11-21తో మలేసియా ద్వయం గో జీ ఫె-నూర్ ఇజుద్దీన్ చేతిలో కంగుతింది.