క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్‌

ABN , First Publish Date - 2021-10-29T08:42:50+05:30 IST

తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్‌లో క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడ్డ సింధు 21-19, 21-9తో వరుస గేమ్‌ల్లో ఓడించి సత్తా చాటింది.

క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్‌

పారిస్‌: తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్‌లో క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడ్డ సింధు 21-19, 21-9తో వరుస గేమ్‌ల్లో ఓడించి సత్తా చాటింది. పురుషుల సింగిల్స్‌లో లోహ్‌ కీన్‌ (సింగ పూర్‌)తో పోటీపడ్డ లక్ష్యసేన్‌ 21-17, 21-13తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. మరో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ తొలి గేమ్‌ 21-16తో నెగ్గినా రెండో గేమ్‌ 12-21తో ఓటమి పాల య్యాడు. అప్పటికే కండరాల గాయంతో బాధపడుతున్న సమీర్‌ మూడో గేమ్‌ ప్రారంభానికి ముందు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో ప్రత్యర్థి షీసార్‌ హిరెన్‌ (ఇండోనేసియా) క్వార్టర్స్‌కు చేరాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్వినీ పొన్నప్ప జోడీ 21-15, 17-21, 19-21తో ప్రవీణ్‌ జోర్డాన్‌-మిలాటి డేవా (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది.

Updated Date - 2021-10-29T08:42:50+05:30 IST