భళా..బైల్స్
ABN , First Publish Date - 2021-05-24T09:14:00+05:30 IST
జిమ్నాస్టిక్స్ క్వీన్ సిమోన్ బైల్స్ తన రీఎంట్రీని ఘనంగా చాటింది. ఈ అమెరికా స్టార్... యూఎస్ క్లాసిక్ పోటీల్లో జిమ్నాస్టిక్స్ వాల్ట్‌లో అత్యం త అరుదైన ‘యుర్‌చెంకో డబుల్ పైక్’తో చరిత్ర సృష్టించింది...

- అరుదైన ఫీట్‌తో జిమ్నాస్టిక్స్ క్వీన్ సరికొత్త చరిత్ర
లాస్ ఏంజిల్స్: జిమ్నాస్టిక్స్ క్వీన్ సిమోన్ బైల్స్ తన రీఎంట్రీని ఘనంగా చాటింది. ఈ అమెరికా స్టార్... యూఎస్ క్లాసిక్ పోటీల్లో జిమ్నాస్టిక్స్ వాల్ట్‌లో అత్యం త అరుదైన ‘యుర్‌చెంకో డబుల్ పైక్’తో చరిత్ర సృష్టించింది. స్ర్పింగ్ బోర్డుపై రౌండ్ తిరుగుతూ వాల్ట్‌పై బ్యాక్ ఫ్లిప్స్‌తో రెండుసార్లు గాల్లో గింగిరాలు తిరిగి ల్యాండ్ అ యింది. దీంతో మహిళల జిమ్నాస్టిక్స్ చరిత్రలోనే ‘యుర్‌చెంకో డబుల్ పైక్’ ఫీట్‌ను పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా 24 ఏళ్ల బైల్స్ రికార్డులకెక్కింది. అయితే, ఈ ఫీట్ చేయడానికి ఎక్కువ బలాన్ని ఉపయోగించిన బైల్స్.. ల్యాండింగ్ సమయంలో ఒకటి రెం డు అడుగులు వెనక్కివేసింది. కాగా, మహిళల రూల్ బుక్‌లో ఈ వాల్ట్ గురించి, పాయింట్ల విధానం గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరం. దీంతో అత్యంత క్లిష్టమైన ఈ ఫీట్‌కు జడ్జీలు 6.6 స్కోరు ఇవ్వక తప్పని పరిస్థితి. ఈ అరుదైన ఫీట్‌ను పురుషుల్లో కూడా చాలా తక్కువ మంది పూర్తి చేశారు. దాదాపు 18 నెలల తర్వాత మళ్లీ పోటీల్లో పాల్గొన్న బైల్స్ సరికొత్త జంప్‌తో.. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది.