శరత్‌-మనికా జోడీకి ఒలింపిక్‌ బెర్త్‌

ABN , First Publish Date - 2021-03-21T09:32:24+05:30 IST

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌కమల్‌, ఏస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకున్నారు. ఆసియా క్వాలిఫికేషన్‌ టీటీ టోర్నమెంట్‌లో శరత్‌-మనికా జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేతగా...

శరత్‌-మనికా జోడీకి ఒలింపిక్‌ బెర్త్‌

దోహా: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌కమల్‌, ఏస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకున్నారు. ఆసియా క్వాలిఫికేషన్‌ టీటీ టోర్నమెంట్‌లో శరత్‌-మనికా జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేతగా నిలిచి టోక్యో టికెట్‌ ఖరారు చేసుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్‌ ఫైనల్లో శరత్‌-మనికా ద్వయం 4-2తో కొరియాకు చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ జోడీ సంగ్‌ లీ-జీ జియోన్‌ను చిత్తుచేసి స్వర్ణం గెలిచింది. భారత్‌ నుంచి టీటీ సింగిల్స్‌లో శరత్‌, సాతియాన్‌ ఇదివరకే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.  


Updated Date - 2021-03-21T09:32:24+05:30 IST