కివీస్‌ను తిప్పేస్తున్న షమీ.. టపటపా రాలుతున్న వికెట్లు

ABN , First Publish Date - 2021-06-23T01:35:34+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా పేసర్ షమీ విజృంభిస్తున్నాడు.

కివీస్‌ను తిప్పేస్తున్న షమీ.. టపటపా రాలుతున్న వికెట్లు

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా పేసర్ షమీ విజృంభిస్తున్నాడు. వరుస వికెట్లు తీస్తూ కివీస్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. 162 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 192 పరుగుల వద్ద జెమీసన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది.


తొలి బంతిని సిక్స్‌కు తరలించి జోరు పెంచినట్టు కనిపించిన జెమీసన్ (21) తర్వాతి బంతిని కూడా స్టాండ్స్‌కు పంపే ప్రయత్నంలో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన విలియమ్సన్ (43) మాత్రం ఇండియన్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం కివీస్ ఏడు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కోల్పోయిన ఏడు వికెట్లలో నాలుగు షమీ ఖాతాలోకి చేరాయి.

Updated Date - 2021-06-23T01:35:34+05:30 IST