‘లఖ్‌నవూ’ మెంటార్‌గా గంభీర్‌

ABN , First Publish Date - 2021-12-19T07:50:30+05:30 IST

టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఐపీఎల్‌లో కొత్తగా చేరిన లఖ్‌నవూ ఫ్రాంచైజీకి మెంటార్‌గా నియమితుడయ్యాడు.

‘లఖ్‌నవూ’ మెంటార్‌గా గంభీర్‌

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఐపీఎల్‌లో కొత్తగా చేరిన లఖ్‌నవూ ఫ్రాంచైజీకి మెంటార్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఈ టీమ్‌  బరిలోకి దిగనుంది. జట్టు మెంటార్‌గా తనను నియమించినందుకు యజమాని సంజీవ్‌ గోయెంకాకు గంభీర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ‘పోటీలో గెలవాలన్న కసి నాలో ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంది. అయితే, ఈసారి నేను డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కాకుండా, ఉత్తరప్రదేశ్‌ గౌరవాన్ని నిలబెట్టేందుకు బరిలోకి దిగుతున్నా’ అని గంభీర్‌ తెలిపాడు. గౌతీ ఐపీఎల్‌లో 4,217 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్‌గా కోల్‌కతా (2012, 2014)కు రెండుసార్లు ట్రోఫీని అందించాడు. 

Updated Date - 2021-12-19T07:50:30+05:30 IST